చికిత్స పొందుతూ వ్యక్తి మృతి.. నిందితులు అరెస్ట్

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి.. నిందితులు అరెస్ట్

BHPL:రంగాపూర్‌లో పాత విభేదాల నేపథ్యంలో దాడికి గురైన పోశయ్య (66) చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ నెల 4న కుమారస్వామి అనే వ్యక్తి కర్రతో దాడి చేయడంతో పోశయ్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. నిన్న చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాధితుడి భార్య ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్టు చేసినట్లు CI తెలిపారు.