దివ్యాంగులకు ఇంద్రధనస్సు పథకం
W.G: నరసాపురంలోని వలందర్ రేవు వద్ద దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ప్రకటించిన ఇంద్ర ధనుస్సు పథకాలు అమలులోకి తీసుకు వచ్చిన సందర్భంగా పీఎం మోదీ, సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొని కేక్ కట్ చేసి దివ్యాంగులకు తినిపించారు.