విద్యుత్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి

విద్యుత్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి

KDP: వనిపెంట స్మశానంలో సెంట్రింగ్ పనులు చేస్తుండగా ఓ వ్యక్తి మృతి చెందారు. గంజిగుంట గ్రామానికి చెందిన గారెల్ల విష్ణుగా స్థానికులు గుర్తించినట్లు తెలిపారు. స్మశానంలో నిర్మించిన భవనం సెంట్రింగ్ తీస్తుండగా నిచ్చెన కరెంటు వైర్లకు తగిలి విష్ణు షాక్‌కు గురైనట్లు స్థానికులు పేర్కొన్నారు. వెంటనే మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.