మూడు అకడమిక్ జోన్లు ఏర్పాటు: మంత్రి కొల్లు
కృష్ణా: రాష్ట్రంలో మూడు అకడమిక్ జోన్ల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నంలో ప్రజాదర్బార్ నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏకకాలంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తూ 2047 నాటికి రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామన్నారు.