సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
NLG: నకిరేకల్ మండలం మంగళపల్లిలో ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా మంజూరైన సీసీ రోడ్ల నిర్మాణ పనులను సర్పంచ్ గాధరి జయమ్మ, ఉపసర్పంచ్ బచ్చుపల్లి రామలింగారావు, పంచాయతీ కార్యదర్శి రజితతో కలిసి ప్రారంభించారు. అభివృద్ధి పనులను నాణ్యతతో, త్వరగా పూర్తి చేయాలని వారు అధికారులకు సూచించారు. గ్రామస్తుల సౌకర్యార్థం మరిన్ని మౌలిక వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు.