రోగి భద్రత ఆరోగ్య సంరక్షణకు మూలస్తంభం: మంత్రి
GNTR: రోగి భద్రత ఆరోగ్య సంరక్షణకు మూలస్తంభమని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ చంద్ర శేఖర్ పెమ్మసాని అన్నారు. శుక్రవారం మంగళగిరి AIIMS 'ఆరోగ్య సంరక్షణ సంస్థలలో రోగి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం' అనే అంశంపై జాతీయ సమావేశం నిర్వహించారు. రోగికి సురక్షితమైన ఆరోగ్య సంరక్షణ వాతావరణాన్ని నిర్ధారించడానికి ఆరోగ్య సంరక్షణ నిపుణులు వినూత్న వ్యూహాలను అవలంబించాలని కోరారు.