అవసరమైతే రాజకీయాల్లోకి వస్తా: విజయసాయి రెడ్డి

అవసరమైతే రాజకీయాల్లోకి వస్తా: విజయసాయి రెడ్డి

AP: ప్రస్తుతానికి తాను రైతును మాత్రమేనని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన లేదని తెలిపారు. వేరే పార్టీల్లో చేరే ఉద్దేశం ఇప్పుడు లేదని పేర్కొన్నారు. అవసరం వచ్చినప్పుడు తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానని అన్నారు. మాజీ సీఎం జగన్ చుట్టూ ఉన్న కోటరీ ఆయనను డైవర్ట్ చేస్తోందని, అందుకే తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పారు.