'ప్రజలు మాదక దవ్యాలకు బానిసలు కావద్దు'
BHPL: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చెల్పూరు గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి దిలీప్ కుమార్ నాయక్ హాజరై, మాట్లాడారు. ప్రజలు డ్రగ్స్, మాదక ద్రవ్యాలకు బానిసలు కావద్దని సూచించారు. ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని అవలంబించాలని పిలుపునిచ్చారు.