కన్నెర్ర చేసిన భానుడు.. ఇళ్లకే పరిమితమైన ప్రజలు
BDK: రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న ఎండ తీవ్రతతో పలు జిల్లాల్లో ఎండల ధాటికి ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. రాష్ట్రంలోనీ అన్ని జిల్లాలలో 40 డిగ్రీల నుంచి 43.3 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ఇవాళ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లొద్దని నిపుణులు సూచిస్తున్నారు.