'పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి'

ADB: బోథ్ మండలం కిస్టాపూర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నూర్ సింగ్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ అడే గజేందర్‌ను ఆయన నివాసంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. పాఠశాలలో అదనపు తరగతి గది, ప్రహరీ గోడ, వంటగది మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు తనవంతుగా కృషి చేస్తానని ఆడే గజేందర్ పేర్కొన్నారు.