స్కూల్స్‌లో వందేమాతరం.. తప్పుబట్టిన ముస్లిం మతపెద్దలు

స్కూల్స్‌లో వందేమాతరం.. తప్పుబట్టిన ముస్లిం మతపెద్దలు

జమ్మూకశ్మీర్ పాఠశాలల్లో వందేమాతరంను తప్పనిసరి చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేయటంపై ముస్లిం మత సంస్థలు వ్యతిరేకించాయి. ఈ చర్యను బలవంతపు ఆదేశాలుగా ముతాహిదా మజ్లిస్-ఏ-ఉలేమా(MMU) అభివర్ణించింది. ఇది అన్యాయమని, ఇస్లాంకు వ్యతిరేకమని చెప్పింది. వందేమాతరంలో ఇస్లామిక్ నమ్మకానికి విరుద్ధంగా భక్తి వ్యక్తీకరణలు ఉన్నాయని అందుకే ముస్లీంలు పాడటానికి అనుమతించమని పేర్కొంది.