క్రేన్ వాహనం ఢీకొని.. వ్యక్తి మృతి నకరికల్లు

గుంటూరు: నరసరావుపేట మండలం కేసానపల్లికి చెందిన ఏడుకొండలు క్రేన్ వాహనం ఢీ కొని మృతి చెందాడు. గుండ్లపల్లి నుంచి స్వగ్రామానికి వెళుతూ.. మార్గమధ్యంలో తేనె విక్రయిస్తున్న వ్యక్తితో మాట్లాడేందుకు బైకును రోడ్డు పక్కన ఆపిన క్రమంలో అటుగా వెళుతున్న క్రేన్ వాహనం అతనిని ఢీకొట్టింది. దీంతో అతను మృతిచెందాడు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.