దనోర సర్పంచ్‌గా మట్ట స్నేహ యాదవ్‌ ఘన విజయం.!

దనోర సర్పంచ్‌గా మట్ట స్నేహ యాదవ్‌ ఘన విజయం.!

ADB: భీంపూర్ మండలం దనోర గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మట్ట స్నేహ యాదవ్‌ (బీఆర్‌ఎస్‌) విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి గోప లక్ష్మీబాయిపై 89 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గ్రామంలో 83.06 శాతం పోలింగ్‌ నమోదైంది. ప్రజల నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ.. గ్రామ అభివృద్ధిని ప్రాధాన్యంగా తీసుకుంటానని స్నేహ యాదవ్ తెలిపారు.