'హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం'

CTR: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మున్సిపల్ ఛైర్మన్ అలీమ్ బాషా అన్నారు. మంగళవారం పుంగనూరు పట్టణంలోని కుమ్మరి వీధి, తూర్పు మొగసాల ప్రాంతాల్లో 'బాబు షూరిటీ - మోసం గ్యారెంటీ' కార్యక్రమాన్ని YCP క్యాడర్‌తో నిర్వహించారు. కూటమి ప్రభుత్వం పరిపాలనలో వైఫల్యం చెందిన విధానాన్ని ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు.