గొంతులో ఖర్జూరం ఇరుక్కొని ఊపిరాడక మృతి
సత్యసాయి: పెనుకొండలో గురువారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. తోటగేరి గ్రామానికి చెందిన గంగాధర్ (42) ఇంట్లో ఖర్జూరాలు తింటుండగా ఒకటి గొంతులో ఇరుక్కొని ఊపిరాడక మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులో వచ్చింది. కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. విషయం తెలుసుకున్న మంత్రి సవిత బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.