'అరైవ్ అలైవ్' పై ర్యాలీ
KNR: భాగంగా ఆర్టీసీ, రవాణా, పోలీసు శాఖల ఆధ్వర్యంలో 'అరైవ్ - అలైవ్' పై బస్టాండ్ పరిధిలోని KNR -1 డిపో నుంచి గీతాభవన్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరు క్షేమంగా ఇల్లు చేరుకోవడానికి రోడ్డు వినియోగ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రవాణా విభాగ అధికారులు ప్రతిజ్ఞ చేయించారు. ఆర్టీసీ RM బీ. రాజు, KNR టౌన్ ఏసీపీ వెంకటస్వామి, తదితరులు ఉన్నారు.