ట్రెండ్ మారింది.. సోషల్ మీడియా వేదికైంది..!
RR: స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సమయం తక్కువగా ఉండడంతో సోషల్ మీడియాపై దృష్టి సారించారు. గ్రామాల్లో పనుల నిమిత్తం ప్రజలు బీజీగా ఉండడంతో ఇంటింటి ప్రచారం కుదరదనే భావంతో ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే, ఉద్యోగ రీత్యా బయట పట్టణాలకు వెళ్లిన వారి దృష్టిని కూడా ఆకర్షించే యోచనలో భాగంగా ఈ ప్రచారానికి తెరదీసినట్లు సమాచారం.