బండి సంజయ్‌ని కలిసిన చిన్నోనిపల్లి గ్రామస్తులు

GDWL: కేంద్ర హోం శాఖ మంత్రి బండి సంజయ్‌ని శుక్రవారం గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కలిసిన సంగతి తెలిసింది. గద్వాల్ ఎమ్మెల్యే వెంట వెళ్లిన గట్టు మండలం పరిధిలోని చిన్నోనిపల్లి గ్రామస్తులు మంత్రి బండి సంజయ్‌కి వారి గ్రామంలో ఉన్న సమస్యల గురించి వినతి పత్రం సమర్పించారు. గ్రామంలో ఇప్పటికీ సరైన వసతి సౌకర్యం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.