MVN విజ్ఞాన కేంద్రంలో కవి సమ్మేళనం

NLG: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల్లో భాగంగా MVN విజ్ఞాన కేంద్రంలో 'తెలంగాణ స్ఫూర్తి' అనే అనే అంశంపై కవి సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజ్ఞాన కేంద్రం కన్వీనర్ డా. అక్కెనపల్లి మీనయ్య అధ్యక్షత వహించారు. ప్రముఖ కవి రచయిత డాక్టర్ బెల్లి యాదయ్య మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు.