చీరాలలో వాహనాల తనిఖీలు నిర్వహించిన ఎస్సై

BPT: చీరాల - పర్చూరు ప్రధాన రహదారిపై సోమవారం ఎస్సై ఖాదర్ భాష ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనాలకు చలానాలు విధించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని, రోడ్డు భద్రత నియమాలను పాటించాలని ఎస్సై సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.