ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ 26 గేట్లు ఎత్తివేత

ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ 26 గేట్లు ఎత్తివేత

NRML: జిల్లాలో భారీ వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరుతుండడంతో సోమవారం ఎస్సారెస్పీ ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తివేశారు. దిగువ ప్రాంత ప్రజలు, జాలరులు అప్రమత్తంగా ఉండాలని, ప్రాజెక్టు వైపు రావద్దని అధికారులు హెచ్చరించారు. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 80.053 టీఎంసీలు కాగా ప్రస్తుతం 86270 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నామన్నారు.