పోస్టల్ బ్యాలెట్‌లో ఉద్యోగుల ఓటు.!

పోస్టల్ బ్యాలెట్‌లో ఉద్యోగుల ఓటు.!

MHBD: కొత్తగూడ మండలంలోని పలు శాఖల ఉద్యోగులు నిన్న తమ ఓటును వినియోగించుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వర్తించేందుకు పలు ప్రాంతాలకు ఉద్యోగులు బయల్దేరుతున్నారు. ఈ క్రమంలో స్థానిక మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా వారు ఓటు వేశారు. వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని సూచించారు.