VIDEO: పారాపురంలో అపారిశుధ్యం
SKLM: కొత్తూరు మండలం పారాపురం పంచాయతీలో రోడ్డు పక్కనే చెత్తాచెదారం ఎక్కడికక్కడ పోగులుగా తయారైందని స్థానికులు అంటున్నారు. ఇండ్లలోనూ, షాపుల్లోనూ ఉపయోగించే వ్యర్థ పదార్థాలను రోడ్డు పక్కన పారవేస్తుండటంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పక్కన చెత్త ఉండడంతో దుర్వాసన అధికంగా వస్తుందని వాహనదారులు వాపోతున్నారు.