సమ్మెకు మద్దతు పలికిన గోకవరం ఎల్ఐసీ ఉద్యోగులు
E.G: దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతుగా గోకవరం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(LIC) ఉద్యోగులు గురువారం విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. భీమా రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(FDI) అనుమతించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎల్ఐసీలో ఖాళీగా ఉన్న క్లాస్ 3, 4 పోస్టులను భర్తీ చేయాలన్నారు.