మురళికొండలో అభివృద్ధి పనులు: ఎమ్మెల్యే గోరంట్ల
E.G: మురళికొండ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారేలా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. మంగళవారం బొమ్మూరు పరిధిలో చేపట్టనున్న అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. మొత్తం 11 పనుల ద్వారా రోడ్లు, కాలువలు మౌలిక వసతుల అభివృద్ధి జరుగుతుందని చెప్పారు.