స్లాటర్ హౌస్‌లు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు

స్లాటర్ హౌస్‌లు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు

VZM: విజయనగరం కంటోన్మెంట్ ప్రాంతంలో వచ్చిన సమాచారం మేరకు స్లాటర్ హౌస్‌లపై 1వ పట్టణ పోలీసులు దాడులు నిర్వహించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న 600 కిలోల మాంసం, 2 వాహనాలు, 3 కత్తులు సీజ్ చేసి కేసు నమోదు చేసినట్టు ఎస్పీ ఎ. ఆర్. దామోదర్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఇటువంటి స్లాటర్ హౌస్‌లు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.