భవన నిర్మాణాన్ని పరిశీలించిన డిప్యూటీ ఎంపీడీవో
ASR: పంచాయితీ భవన నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి కొయ్యూరు డిప్యూటీ ఎంపీడీవో బాబూరావు సూచించారు. శుక్రవారం చింతలపూడిలో నూతనంగా నిర్మిస్తున్న పంచాయతీ భవన నిర్మాణాన్ని పంచాయతీ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావుతో పరిశీలించారు. ఈ సందర్భంగా పంచాయతీ ప్రజల సౌలభ్యం కోసం, సేవలు సక్రమంగా ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం పంచాయతీ భవనాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు.