కళ్యాణోత్సవాలకు ప్రతిష్ట ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

కళ్యాణోత్సవాలకు ప్రతిష్ట ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

కోనసీమ: అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కల్యాణోత్సవాలకు భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.