శ్రీశైలం ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తి నీటి విడుదల

NDL: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతుండటంతో మరో గేటును ఎత్తారు. ప్రస్తుతం 5 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ఈ మేరకు జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. కాగా, శ్రీశైలంలో 1,89,169 క్యూసెక్కులు చేరుతోంది. శ్రీశైలం నుంచి 2,34,544 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.