అల్లిపురంలో భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే వేడుకలు
SRPT: అల్లిపురంలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్త తండా నుంచి అంజలిపురం వరకు 'పరిశుద్ధ సిలువ మార్గం' నిర్వహించారు. ఫాదర్ చిన్నాబత్తిని శౌరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తుడు రాజశేఖర్ సిలువను మోయగా, ఏసుక్రీస్తు త్యాగాన్ని, ప్రేమ సందేశాన్ని భక్తులకు వివరించారు. క్రీస్తు శ్రమలను స్మరిస్తూ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.