ఎస్ఐఆర్ నమోదుపై సీపీ సమీక్ష
KNR: బాధితులకు సత్వరమే న్యాయం అందించడమే లక్ష్యంగా ఆన్సైట్ ఎఫ్ఎఆర్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం అధికారులను ఆదేశించారు. ఎన్హెచ్ఐలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. సంఘటన స్థలంలోనే ఫిర్యాదు స్వీకరించి, ఎఫ్ఎఆర్ నమోదు చేయాలన్నారు. మహిళలు, చిన్నారుల కేసుల్లో వీడియో రికార్డింగ్, ఎస్‌వోపీలు తప్పనిసరిగా పాటించాలన్నారు.