పారిశుధ్యకార్మికులకు యూనిఫామ్, హెల్మెట్ పంపిణీ

పారిశుధ్యకార్మికులకు యూనిఫామ్, హెల్మెట్ పంపిణీ

W.G: పరిసరాల పరిశుభత్రలో పారిశుధ్యకార్మికుల సేవలు ఎనలేనివని గ్రామ సర్పంచ్ కొండవీటి సాంబశివరావు అన్నారు. ఉండి మండలం చెరుకువాడ మేజర్ పంచాయతీలో మంగళవారం గ్రామ పారిశుధ్య కార్మికులకు సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ఒక జత యూనిఫామ్, ఒక జత బూట్లు, జాకెట్, హెల్మెట్, కొబ్బరి నూనె, సబ్బులు, స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి సుభాషిణి పాల్గొన్నారు.