బుచ్చిలో రేపు కౌన్సిల్ సమావేశం
NLR: బుచ్చిరెడ్డిపాలెం పురపాలక సంఘం కార్యాలయంలో చైర్‌పర్సన్ మోర్ల సుప్రజ మురళి అధ్యక్షతన రేపు మంగళవారం కౌన్సిల్ సమావేశం జరుగుతుందని నగర కమిషనర్ బాలకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో 19 అజెండాలు ప్రవేశ పెడుతున్నామన్నారు. ఈ సమావేశానికి కౌన్సిలర్లు, కో ఆప్షన్ నెంబర్లు హాజరుకావాలని కోరారు.