ప్రధానమంత్రి మోదీ దిష్టిబొమ్మ దహనం

KMR: గాంధారి మండల కేంద్రంలోని నెహ్రూ చౌరస్తా వద్ద మంగళవారం సాయంత్రం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పీఎం మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బిస గణేష్, జిల్లా ఉపాధ్యక్షుడు భరత్ రెడ్డి, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు సర్దార్ నాయక్ మాట్లాడుతూ.. మోదీ దేశంలో దొంగఓట్లు వేయించుకొని ప్రధాని అయ్యారని ఆరోపించారు.