ఆసనాలుగా మారిన సర్వే రాళ్లు

ఆసనాలుగా మారిన సర్వే రాళ్లు

PPM: జియ్యమ్మవలస మండలం మరువాడలో వృథాగా పడి ఉన్న సర్వే రాళ్లను గ్రామస్థులు కూర్చోవడానికి ఆసనాలుగా మార్చారు. గత ప్రభుత్వంలో భూ సర్వే కోసం తీసుకువచ్చిన రాళ్లు కొన్ని కారణాలవల్ల అలానే వదిలేశారు. అయితే స్థానికులు అలా నిరుపయోగంగా ఉన్న రాళ్లను చెట్ల కింద కూర్చోవడానికి వీలుగా ఏర్పాటు చేశారు. సాయంత్రం వేళ విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా ఉందని గ్రామస్థులు చెప్పారు.