పాఠశాలకు తాళం.. గేటు బయటే గణతంత్ర వేడుకలు
ASR: వీ.ఆర్.పురం మండలం రామవరప్పాడు GPS పాఠశాలకు స్థలదాత తాళం వేయడంతో, ఉపాధ్యాయులు గేటు బయటే జాతీయ జెండాను ఎగురవేశారు. గతంలోనూ ఆయన ఇలాగే చేయడంతో విద్యార్థులు రచ్చబండపై చదువుకున్నారని స్థానికులు వాపోయారు. విద్యాశాఖ అధికారులు స్పందించి, పాఠశాలకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.