పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి ఫిర్యాదులు.!

GDWL: జిల్లాలోని పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రతి ఫిర్యాదుపై వెంటనే స్పందించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని డీఎస్పీ మోగిలయ్య అన్నారు. గద్వాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావాణిలో డీఎస్పీ పాల్గొని వివిధ ప్రాంతాల నుంచి 8 ఫిర్యాదులను స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.