జిల్లాలో కోతుల బీభత్సం.. భయాందోళనలోప్రజలు
JN: జిల్లా కేంద్రంలో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. కాలనీలలో వందల సంఖ్యలో కోతులు గుంపులుగా ఇళ్లలోకి చొరబడి పట్టణ ప్రజలను భయపెడుతున్నాయి. కోతులను నిర్మూలించేందుకు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సిబ్బందికి కొండముచ్చు వేషధారణ వేయించి పట్టణంలో తిరిగిన విషయం తెలిసిందే. అయినా, ఆ ప్రక్రియ మూడునాళ్ల ముచ్చటగానే మిగిలిందని చర్చించుకుంటున్నారు.