సామాజిక స్పృహతోనే వెట్టిచాకిరి నిర్మూలన: కలెక్టర్
GNTR: సామాజిక స్పృహతోనే వెట్టిచాకిరి వంటి వ్యవస్థలను నిర్మూలన చేయవచ్చని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. వెట్టిచాకిరి నిరోధక చట్టం అమలు కమిటీ సమావేశం కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. కమిటీ సభ్యులు అంకితభావంతో పనిచేసి వెట్టిచాకిరి వ్యవస్థ లేకుండా చూడాలన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహ కలిగి ఉండి, ఇందులో భాగస్వామ్యం కావాలని కోరారు.