ప్రైవేట్ ఆసుపత్రుల తనిఖీ

KDP: దువ్వూరులోని ప్రైవేట్ ఆస్పత్రులను డిప్యూటీ డీఎంహెచ్వో మల్లేష్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డాక్టర్లకు పలు హెచ్చరికలు చేశారు. యాంటీబయాటిక్, స్టెరాయిడ్స్ వంటి మందులను సిఫార్స్ చేయవద్దని సూచించారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవన్నారు. రోగుల నుంచి ఫిర్యాదులు వస్తే ఆసుపత్రులను సీజ్ చేస్తామన్నారు.