ALERT: రేపటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు

TG: HYD ఖైరతాబాద్‌లో రేపు బడా గణేష్ కొలువుదీరనున్నాడు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ చుట్టుపక్కల పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపటి నుంచి సెప్టెంబర్ 6 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఖైరతాబాద్, షాదన్ కాలేజీ, నిరంకారి, ఓల్డ్ పీఎస్ సైఫాబాద్, మింట్ కాంపౌండ్, నెక్లస్ రోటరీ వద్ద ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో 10 రోజులపాటు వాహనాల దారి మళ్లింపు ఉంటుందని చెప్పారు.