నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
W.G: పెనుగొండ మండల కేంద్రంలోని 33/11 సబ్ స్టేషన్ పరిధిలో 5 ఎమ్‌వీఏ ట్రాన్స్‌ఫార్మర్ మార్చుతున్న నేపథ్యంలో పెనుగొండ మండల వ్యాప్తంగా సోమవారం విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని ఈఈ మధుకుమార్ ఆదివారం తెలిపారు. ఈ మేరకు సోమవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. ఈ విషయాన్ని విద్యుత్ వినియోగదారులు గమనించాలని కోరారు.