'బ్యాంకులలో ఆర్థిక మోసాలు జరగకుండా జాగ్రత్త వహించాలి'

BPT: ఇంకొల్లు పోలీస్ స్టేషన్‌లో బుధవారం బ్యాంకు మేనేజర్లతో సమావేశం నిర్వహించిన సీఐ రమణయ్య మాట్లాడుతూ, బ్యాంకుల లావాదేవీల్లో మోసాలు జరుగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఖాతాదారుల వివరాలను రహస్యంగా ఉంచాలని, సైబర్ మోసాలపై వారిని సైతం హెచ్చరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బ్యాంక్ మేనేజర్‌లు పాల్గొన్నారు.