గణపురంలో ఘనంగా హోలీ వేడుకలు
BHPL: గణపురం మండల కేంద్రంతో పాటు శివారు గ్రామాల్లో మంగళవారం హోలీ పండుగ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచే యువత, చిన్నారులు వీధుల్లోకి దిగి రంగుల వర్షంలో మునిగితేలారు. ఒకరికొకరు సహజ రంగులు పూసుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పెద్దలు, యువత, పిల్లలు అందరూ రంగుల ఆనందంలో తడమారారు. మండలమంతా రంగుల సందడితో నిండిపోయింది.