VIDEO: యాదాలంకపల్లిలో ఘనంగా సత్యమ్మ తల్లికి బోనాలు
సత్యసాయి: బుక్కపట్నం మండలం యాదాలంకపల్లిలో గ్రామదేవత సత్యమ్మతల్లికి ఆదివారం ఘనంగా బోనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి, ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలో మహిళలు పెద్దఎత్తున వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఊరు వెలుపలున్న పోతలయ్య స్వామికి గ్రామ పెద్దల ఆధ్వర్యంలో పూజలు చేసి, బోనాలు సమర్పించారు.