'రాజు వెడ్స్ రాంబాయి'.. సాంగ్ ప్రోమో రిలీజ్
యువ నటీనటులు అఖిల్, తేజస్విని జంటగా 'రాజు వెడ్స్ రాంబాయి' అనే చిత్రాన్ని ఈటీవీ విన్ తెరకెక్కిస్తోంది. తెలంగాణ నేటివిటీతో వస్తున్నా ఈ సినిమాకు సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా, ఈ చిత్రం నుంచి 'రాంబాయి నీ మీద నాకు మనసాయనే' అనే పాట ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. రేపు పూర్తి సాంగ్ విడుదల కానుంది. కాగా, ఈ సినిమా ఈనెల 21న రిలీజ్ కానుంది.