రహదారుల భద్రతపై ఎస్టీ.ఛైర్మన్‌కు వినతిపత్రం
ASR: రంపచోడవరంలో ఎస్టీ.ఛైర్మన్ సొళ్ల బొజ్జి రెడ్డిని మారేడుమిల్లి జడ్పీటీసీ గొర్లె బాలాజీ బాబు ఆదివారం ఉదయం కలిశారు. పర్యాటక ప్రాంతమైన మారేడుమిల్లిలో రక్షణ కోసం, రంపచోడవరం-చింతూరు ఘాట్ రోడ్డు, బ్రిడ్జిల వద్ద డివైడర్లు, సేఫ్టీ రాడ్లు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సస్మిత్, విక్టర్ బన్ను, కర్నెంద్రం పాల్గొన్నారు.