భూభారతి దరఖాస్తులపై ప్రత్యేక సమీక్ష

NZB: ఆలూరు మండలంలో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా పరిషత్ హై స్కూల్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సహకార సంఘం ఎరువుల గోడౌన్, తహసీల్దార్ కార్యాలయాలను కలెక్టర్ సందర్శించారు. ముందుగా కల్లడి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. అందుబాటులో ఉన్న ఔషధ నిల్వలను కలెక్టర్ పరిశీలించారు.