భద్రాద్రి రామయ్యకు మహదాశీర్వచనం

భద్రాద్రి రామయ్యకు మహదాశీర్వచనం

TG: శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలలో భాగంగా భద్రాద్రి రామయ్యకు కళ్యాణం, మహా పట్టాభిషేకం ముగిసిన మరుసటి రోజు పండితులు మహదాశీర్వచనం పలికారు. ఇవాళ ఉదయం నిత్యవిధులు అనంతరం యాగశాలలో చతుస్థానార్చన, హవనము, నిత్య పూర్ణాహుతి నిర్వహించారు. సాయంకాలం శ్రీ స్వామివారిని ప్రాకార మంటపమునందు వేంచేపు చేసి ముందుగా వేదస్వస్తి నిర్వహించి.. తరువాత మహదాశీర్వచనం కార్యక్రమం వైభవోపేతంగా జరిపారు.