'మండపాల వద్ద సత్ప్రవర్తన గల వాలంటీర్లను నియమించాలి'

MBNR: వినాయక మండపాల వద్ద సత్ప్రవర్తన కలిగిన వాలంటీర్లను నియమించాలని మహబూబ్‌నగర్ ఒకటవ పట్టణ సీఐ అప్పయ్య అన్నారు. వినాయక చవితి వేడుకల సందర్భంగా మంగళవారం పట్టణంలోని అల్మాస్ ఫంక్షన్ హాల్లో వినాయక మండపాల నిర్వాహకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేడుకల సందర్భంగా డీజేలకు అనుమతి లేదని వెల్లడించారు.